24గంటలూ 26వ వార్డుకు సేవలో!
👉 గత 30 సం”లుగా తాండూరు రాజకీయల్లో
👉 గతంలో భర్త భావిగి భద్వేశ్వర స్వామి దేవాలయం సేవలో
👉 అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా?
👉 బంటారం రూపాలి సుధాకర్
నేటి ఇజం తాండూరు :: రానున్న తాండూరు మున్సిపల్ ఎన్నికలలో పట్టణంలోని వార్డు నంబర్ 26 నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు బంటారం రూపాలి సుధాకర్ అన్నారు. వార్డ్ నెంబర్ 26 వార్డు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే భర్త బంటారం సుధాకర్ గత 30 సం”లుగా స్థానికంగా తాండూరులోనే రాజకీయాలలో -వ్యాపారంలో-ది గ్రీన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ బాధ్యతలతో అందరికీ సుపరిచితులుగా ఉంటూ గతంలో భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ గా సేవలు అందించారని తెలిపారు. MA బిఈడి విద్యావంతురాలైన తనకు ప్రతి అభివృద్ధి విషయంలో అవగాహన ఉందని కావున 26వ వార్డు ప్రజలు అవకాశం కల్పించి ఆదరించాలని కోరారు.

