కల్లు సాక వట్టినం! యాటల్ని ఇచ్చినం.. బోనం తిప్పినం.. 

కల్లు సాక వట్టినం! యాటల్ని బలిచ్చినం.. బోనం తిప్పినం.. 

👉ఆరగించు మా అమ్మ కాళికా దేవి

 👉సల్లంగా సూడమ్మా! కట్ట మైసమ్మ తల్లీ

👉 జగమేలే జగజ్జేతివే మాతల్లి 

👉 తెలంగాణ సంస్కృతితో ఊగులాడిన తాండూరు పట్టణం 

👉 అలరించిన పోతురాజుల విన్యాసాలు

నేటి ఇజం తాండూరు : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో ముఖ్యమైన బోనాల పండుగ నేపద్యంలో ఆదివారం తాండూరు పట్టణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ముఖ్యంగా తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి ఆలయం, గాంధీనగర్ రక్త మైసమ్మ, పాత కుంటలో వెలసిన కట్ట మైసమ్మ,సాయిపూర్ కట్ట మైసమ్మ తదితర ఆలయాలలో బోనాల పండుగను పురస్కరించుకొని ఉదయం నుండే భక్తులు అమ్మవారికి కల్లు సాక పట్టి, కోళ్లు, మేకలతో ప్రత్యేక నైవిద్యాలను సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగురంగుల పూలు, కట్టూబొట్టుతో సర్వాంగ సుందరంగా ప్రత్యేకంగా అలంకరించి ముస్తాబు చేసిన బోనాలతో ఆలయాలలో ప్రదక్షిణలు చేశారు. శ్రీ కాళికాదేవి ఆలయంలో మున్సిప్ మెజిస్ట్రేట్ పుష్పలీల బోనం సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, దేవాదాయశాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించిన అమ్మవారి బోనాల పండుగలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.