పాలకుల నిర్లక్ష్యమా! అధికారుల అసమర్ధతనా?
👉ఎన్నో ఏళ్లుగా నడకయాతన
👉 వర్షం పడిందంటే. ఆ కాలనికి యమదారే
👉సుమారు 5 గంటలుగా ఇంట్లో నుండి బయటికి రాని దుస్థితి.
👉 పిల్లలకు పాల ప్యాకెట్లు కూడా లభించని వైనం
👉 స్తంభించిన జనజీవనం
👉 అయ్యా మార్కండేయ స్వామి ఇప్పుడైనా కరుణించు!
👉 నీట మునిగిన ఇండ్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు
👉చిలక (వాగు) నాట్యంతో ప్రతి వర్షాకాలం అలసిపోతున్న మార్కండేయకాలనీ ప్రజలు
👉 నడుములోతు నీళ్లలో సాహసించి నడిచి వెళ్తున్న ప్రజలు
👉 ట్రాక్టర్ల పై ప్రయాణిస్తూ విధులకు వెళ్తున్న ప్రభుత్వ టీచర్లు
👉 చుట్టూ నీరు చేరడంతో తాండూరుకే ద్వీపకల్పంగా మారిన మార్కండేయ కాలనీ 
నేటి ఇజం -తాండూరు : పాలకుల నిర్లక్ష్యము – అధికారుల అసమర్థతతో ఎన్నో ఏళ్లుగా నరకయాతణ అనుభవిస్తూ రాత్రి కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైన మార్కండేయ కాలనీలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.

రాత్రి కురిసిన భారీ వర్షాలకు కాలనీ మొత్తం ముంపునకు గురై సుమారు 5 గంటలుగా జనజీవనం స్తంభించిపోయింది. కనీసం పిల్లలకు పాల ప్యాకెట్ తీసుకొద్దామన్నా కూడా ఇంట్లో నుండి బయటకి రాని దుస్తుతి నెలకొంది. రెక్కాఢితే కాని డొక్కాడని పేద ప్రజలు కూలికి వెళ్లేందుకు నడుము లోతు నీళ్లలో పాములను చూసి సర్కస్ ఫీట్లను తలదన్నేలా నడుచుకుంటూ ప్రాణభయంతో బయటకు వచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ విధులకు వెళ్లేందుకు కాలనీ ప్రజల సహాయంతో ట్రాక్టర్ల పై ప్రయాణం చేసి విధులకు వెళ్లిన పరిస్థితి దాపరించింది.
ఎన్నో సంవత్సరాలుగా వర్షాలు పడే ప్రతిసారి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించచాలంటూ సాక్షాత్తు ఆ మార్కండేయ స్వామిని వేడుకోవడం తప్ప..మరో మార్గం లేదంటూ మార్కండేయ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

