బిసీ స్మశానవాటికలో కనీస సౌకర్యాల కల్పన
👉 బోరు మోటారు ఏర్పాటు
👉ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ నేత రాజ్ కుమార్
👉స్మశాన వాటిక పూర్తి అభివృద్ధికి ₹65 లక్షల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
👉 సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే
నేటి ఇజం తాండూరు: తాండూరు పోలీస్ స్టేషన్ వెనకాల బీసీ స్మశాన వాటికలో నీటి వసతి కొరకు బోరు అలాగే చేతి పంపు ఏర్పాటుకు ప్రత్యేకంగా చోరువ తీసుకొని ఏర్పాటుకు సహకరించిన తాండూర్ ఎమ్మెల్యే బియ్యాన్ని మనోహర్ రెడ్డికి జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని దశబ్దాలుగా బీసీ స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అందుకు బీసీ నేత రాజ్ కుమార్ అనేకమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. గత రెండు నెలల క్రితం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రాజ్ కుమార్- బీసీ సంఘం నాయకులు స్మశాన వాటిక అభివృద్ధికి వినతి పత్రం ఇచ్చారు.అందుకు వారు సానుకూలంగా స్పందించి కొన్ని నిధులు స్మశాన వాటిక అభివృద్ధి కొరకు కేటాయించారు.అదేవిధంగా బోరు వేయించి చేతిపంపు ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి చేశారు. స్మశాన వాటిక పూర్తి అభివృద్ధి చెందాలంటే దాదాపుగా ₹65 లక్షల రూపాయలు నిధులు కావాలని అందుకు ఎమ్మెల్యే మరిన్ని నిధులు కేటాయించాలని రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

