మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి.

మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి.

 👉వార్డు నం 23లో మహిళా సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ 

👉 ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో తాండూరు అభివృద్ధి 

నేటి ఇజం :తాండూరు :: మహిళల ఆర్థిక అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వార్డు నం 23 కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం తాండూరు పట్టణం వార్డ్ నెంబర్ 23 వాల్మీకి నగర్ ఎంపీటీ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటేశ్వరులుగా చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పథకంలో కూడా మహిళలకు అగ్రపీఠం వేస్తూ పెట్రోల్ బంకులను, కొనుగోలు కేంద్రాలను, మహిళా సమాఖ్య గ్రూపులకు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు సైతం ప్రోత్సాహం అందిస్తూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ 23 కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భరత్ రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి, సీనియర్ నాయకులు దొరిశెట్టి సత్య మూర్తి,వీరేష్ మహిళా సంఘం నాయకులు కాలనీ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *