మార్కండేయకాలనీ సమస్యకు పరిష్కారం
👉ముందుండి పనులు చేయించిన నాయకులు
👉 చురుగ్గా సాగుతున్న చిలుక వాగు పనులు
👉 పక్షం రోజుల్లో బ్రిడ్జి పనులు పూర్తి
👉 ఏఎంసి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
నేటి ఇజం తాండూరు : స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారాలతో మార్కండేయ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు.రాత్రి కురిసిన భారీ వర్షానికి మార్కండేయ కాలనీలో నెలకొన్న సమస్యలను,ప్రజల ఇబ్బందులను తెలుసుకొని స్థానిక నాయకులు వికాస్ జ్యోషి, శ్రీనివాస్ గౌడ్, లోంక lబాల్ రాజ్ తదితరులతో కలిసి కాలనీలో విస్తృతంగా పర్యటించారు. కాలనీని ముంచెత్తిన వరద నీటిని మున్సిపల్ అధికారులను సమన్వయం చేస్తూ జెసిబితో కల్వర్టుకు అడ్డంగా ఉన్న కాలువలోని పూడిత తీయించి వరదనీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.

