కాంగ్రెస్ పార్టీతోనే పట్టణ అభివృద్ధి
👉ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు
👉సాయిపూర్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం
👉 కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు మల్లప్ప బంటు వేణు
నేటి ఇజం తాండూరు: కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తాండూరు పట్టణ అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటుమల్లప్ప- బంటువేణు అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని సాయిపూర్ వార్డ్ నెంబర్ 09లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో మంజూరైన ₹5 లక్షల రూ “లతో బంటు మల్లప్ప బంటువేణు ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నాయకులు బంటు మల్లప్ప-బంటు వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో తాండూరు పట్టణం దిన దినాభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

