బల్దియాపై పట్టు బిగిస్తున్న పట్లోళ్ల.
👉 మచ్చలేని నాయకుడు పట్లోళ్ల నర్సింలు
👉ప్రజాక్షేత్ర రాజకీయాల్లో సిద్ధహస్తులు
నేటిఇజం :తాండూరు: తాండూరు మున్సిపల్ బల్దియాపీఠం కైవసం చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే పైలెట్ నాయకత్వంలో డాక్టర్ సంపత్ ఆశీస్సులతో తాండూరు పట్టణంలో పట్లోళ్ల నర్సింలు పట్టు సాధిస్తున్నారని సమాచారం. గడిచిన మున్సిపల్ ఎన్నికలలో ఓటమి ఎరగని పట్లోళ్ల కుటుంబంగా పేరు సంపాదించారు.
మూడు పర్యాయాలుగా మున్సిపల్ కౌన్సిలర్ గెలుపు సాధించి 4వ సారి బల్దియా ఎన్నికలకు భార్యాభర్తలు సిద్ధంగా బరిలో గెలుస్తున్నారు. ఇప్పటికే తాండూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ జనరల్ కావడంతో అందరూ ఊహించినట్లుగానే బిఆర్ఎస్ పార్టీ తరఫున చైర్మన్ పదవికి పట్లళ్ల నర్సింలు పేరుని ఖరారు చేశారు. ఇప్పటివరకు బిజెపి, కాంగ్రెస్ పా. 2009లో మొదటిసారి పట్టణంలోని సాయిపూర్ 9 వ వార్డు నుంచి పోటీ చేసిన పట్లోళ్ల నర్సింలు ప్రత్యర్థి అభ్యర్థులపై గెలుపు సాధించారు. 2014లో రెండవసారి కూడా అదే వార్డ్ నుంచి పోటీ చేసిన నర్సింలు సతీమణి సావిత్రమ్మ రెండవసారి గెలుపు సాధించారు. 2019లో మూడవసారి ఎన్నికల పోరులో అదే వార్డ్ నుంచి దీపా నర్సింలు గెలుపు సాధించి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. గడిచిన మున్సిపల్ ఎన్నికలలో దీప నర్సింలును చైర్మన్ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అప్పట్లో ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ రాజకీయ కారణాల వల్ల సాధ్యం కాలేకపోయింది. ఈసారి మున్సిపల్ పీఠం బీసీ జనరల్ కు రిజర్వు కావడంతో భార్యాభర్తలిద్దరూ మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్నారు.
సాయిపూర్ తొమ్మిదో వార్డు నుంచి దీప నర్సింలు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా సాయిపూర్ లోని పదో వార్డ్ నుంచి పట్లోళ్ల నర్సింలు పోటీ చేస్తున్నారు.

