అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

👉పీహెచ్‌డీ, నెట్, సెట్, ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత

👉 ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం

👉తాండూర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వసంతకుమారి

తాండూరు  నేటి ఇజం :ప్రభుత్వ డిగ్రీ కళాశాల తాండూరులో పలు సబ్జెక్టులు బోధించుటకు అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వసంతకుమారి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. ఇంగ్లీష్ 2, తెలుగు 2, వాణిజ్య శాస్త్రం 2, కంప్యూటర్ సైన్స్ 2, పొలిటికల్ సైన్స్, మాథ్స్, హిందీ, జువాలజీ, బోటనీ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఖాళీగా ఉన్నాయన్నారు. సంబంధిత సబ్జెక్టులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 50% మార్కులు, ఇతర కేటగిరీలకు చెందిన వారు 55 % మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. అంతేకాకుండా పీహెచ్‌డీ, నెట్, సెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, అనుభవజ్ఞులు తప్పనిసరిగా సర్వీస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 23వ తేదీ సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలకు కళాశాలల సంప్రదించాలని సూచించారు.