తాండూరు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బి.ఎం.ఆర్
👉 బంటువేణు ఆధ్వర్యంలో 15 లక్షలతో రోడ్డు పనులకు శ్రీకారం
నేటిఇజం : తాండూరు ప్రాంత అభివృద్ధి ప్రదాత స్థానిక శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు వేణు, బంటుమల్లప్ప, సీనియర్ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తాండూరు ప్రాంత అభివృద్ధిలో భాగంగా తాండూరు పట్టణ రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కంకణ బద్ధులై పనిచేస్తున్నారని ఎమ్మెల్యే సహకారంతో వార్డు నెంబర్ 11 లో బంటువేణు బంటు మల్లప్ప ఆధ్వర్యంలో సి సి రోడ్డు నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు స్థానిక కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

