ఏమైంది ఈ రోడ్డుకు??

ఏమైంది ఈ రోడ్డుకు??

👉 ఒకవైపు అంబులెన్స్ లు

👉మరోవైపు చెట్ల కొమ్మలు 

👉 జూనియర్ కాలేజీ- ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు దుస్థితి

నేటిఇజం : ఒకవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాల- మరోవైపు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి మధ్యలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ రోడ్డును ఎవరూ పట్టించుకొక పోవడంతో ఇటు ప్రజలు అటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలకు అడ్డంగా చెట్ల కొమ్మలు ఉన్నాయంటూ గత 20 రోజుల క్రితం కొమ్మలను తొలగించిన అధికారులు అప్పటి నుండి రోడ్డు పక్కనే వదిలేయడంతో అసలే వర్షాకాలం చెట్ల కొమ్మలు దోమలకు నిలయంగా మారి జిల్లా ఆసుపత్రి రోగులపై తమ పంజా విసురుతున్నాయని పలువురు వాపోతున్నారు.ఇదిలా ఉండగా మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డు వెంబడి పదుల సంఖ్యలో అంబులెన్స్ లు రోడ్డుపై నిలపడంతో ఇటు కళాశాల విద్యార్థులు అటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డు వెంబడి ఉన్న చెట్ల కొమ్మల వ్యర్థాలను, రోడ్డుపై నిలిపిన అంబులెన్స్ వానాలను తొలగించాలని పలువురు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.