కాయ్… రాజా… కాయ్! కౌన్సిలర్ కూత?
👉మున్సిపల్ బరిలో పందెం కోళ్ళు
👉 ఆ గట్టునుంటావా! ఈ గట్టుకు వస్తావా??
👉 సంక్రాంతి పందెం కోళ్లు జీడిపప్పు -బాదం తింటే!! మున్సిపల్ బరిలో నిలిచే ఈ నాటుకోళ్ళు ఏమి తింటాయో మరి?
👉 సంక్రాంతి పందెం కోళ్ళు ఓడిన కూడా…మాంసంకు మస్త్ డిమాండ్.. కానీ మున్సిపల్ బరిలో ఓడిన నాటు కోళ్లను ఎవరైనా పట్టించుకుంటారా?
👉 చురుకుగా బలిష్టంగా ఉండే సంక్రాంతి కోళ్లను బరిలో దించుతారు. కానీ మున్సిపల్ బరిలో సీనియర్లు అనే బలుపు పందెం కోళ్లను బరిలో దింపుతారంటా ఎందుకో తెలుసా???
👉మున్సిపల్ పందెం కోళ్లకు బలం -బలగం అవసరం లేదంటా?? కేవలం ఆర్థిక బలం ఉంటే చాలంటా మరి నిజమేనా??
👉 ఉదయం మేల్కొనేందుకు కూత పెట్టే సమయం నుండి పార్టీకి సేవ చేసే సామాన్య కార్యకర్తలను ఎన్ని పార్టీలు బరిలోకి దింపుతాయో చూడాలి మరి?
👉 రసవత్తర రాజకీయ మున్సిపల్ పందెంలో మీసం మెలేసి తొడగొట్టేది ఎవరు??
✍️✍️✍️✍️నేటి ఇజం

