అడవిలో మహిళ దారుణ హత్య
👉రుక్మాపూర్ స్టేషన్ అటవీ ప్రాంతంలో ఘటన
👉గొంతు కోసి దారుణంగా హత్య చేసిన దుండగులు
👉హత్యకు గురైన మహిళ ఎవరంటే?
నేటి ఇజం :తాండూరు :: నిర్మానుష్య అటవీ ప్రాంతంలో మహిళను గొంతు కోసి హత్య చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తెలిసిన సమాచారం ప్రకారం యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన మహిళను పెద్దేముల్ మండలం రుక్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోని నిర్మానుష ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం.మృతి చెందిన మహిళ యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన లొంక బందెమ్మగా గుర్తించినట్లు తెలుస్తుంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

