వెర్నాక్యులర్ యాక్ట్ (1878)ను తిరగరాసిన రేవంత్.?

వెర్నాక్యులర్ యాక్ట్ (1878)ను తిరగరాసిన రేవంత్.

👉 నాడు భారత మీడియాపై బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కుపెట్టిన ఆయుధం వెర్నాక్యులర్ యాక్ట్

Oplus_131072

👉 రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఎ హక్కును కాల రాస్తున్న రేవంత్ సర్కార్?

👉ఆర్టికల్ 19(1)(ఎ) ముఖ్య అంశాలు:

👉భావప్రకటన స్వేచ్ఛతమ అభిప్రాయాలను, ఆలోచనలను ఎలాంటి భయం లేకుండా వ్యక్తపరచడం.

మాధ్యమాలు: మాటలు, రాతలు, ముద్రణ, కళ, ప్రసారాలు (broadcast) వంటి వివిధ మాధ్యమాల ద్వారా వ్యక్తీకరించవచ్చు

👉అంతర్గత హక్కులు:దీని కింద పత్రికా స్వేచ్ఛ, వాణిజ్య ప్రసంగ స్వేచ్ఛ, విమర్శించే హక్కు, సమాచార హక్కు, అలాగే మాట్లాడకుండా ఉండే హక్కు కూడా ఉంటాయి.

👉పరిమితులు:ఈ స్వేచ్ఛకు దేశ సార్వభౌమత్వం, భద్రత, నైతికత, ప్రజా శాంతి, అలాగే కోర్టు ధిక్కారం వంటి కారణాలతో ప్రభుత్వం సహేతుకమైన ఆంక్షలు విధించగలదు.

👉 కానీ ఇందులో అలాంటివి ఏమీ లేవు.. అలాంటప్పుడు ముందస్తు సమాచారం లేకుండా జర్నలిస్టులను ఓ తీవ్రవాదులను అరెస్టు చేసినట్టు ఎలా అరెస్టు చేస్తారు?

👉సంక్షిప్తంగా, ఆర్టికల్ 19(1)(ఎ) అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన భావప్రకటన స్వేచ్ఛను పౌరులకు అందించే ముఖ్యమైన నిబంధన.

👉 ఇదిలా ఉండగా నాడు గత ప్రభుత్వంలో అర్థరాత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ కూతురు పెళ్లి సమయంలో అన్యాయంగా అరెస్టు చేసినప్పుడు ఇదే ఆర్టికల్ 19(1)ఎ ప్రకారం మేము ప్రసారం చేయకుంటే మీకు ఇంత పలుకుబడి క్రేజ్ వచ్చేదా?? ఆలోచించండి.. సీఎం రేవంత్ రెడ్డి.

Oplus_131072

👉పెన్నును భయపెడుతూ గన్నుతో సంకెళ్లు వేసే ప్రభుత్వలకు… నాయస్థానం అనే అడ్డుకట్ట! ఆసరాగా నిలిచి నిర్భంధం నుండి తాత్కాలికంగా విడుదల చేయడం (బెయిల్)ప్రభుత్వలపై కాకుండా న్యాయస్థానాలపై నమ్మకం ఇంకా బతికి ఉందనీ మరోసారి రుజువైంది.

నేటి ఇజం ✍️✍️✍️✍️✍️✍️✍️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *