మెరిసిన దరిగడ్డ రైతు ముద్దుబిడ్డ!

మెరిసిన దరిగడ్డ రైతు ముద్దుబిడ్డ.

👉 జాతీయ క్రీకెట్ ఎస్ జి ఎఫ్ ఐ కు రాష్ట్ర స్థాయికి ఎంపిక.

👉 సాధారణ రైతు కుటుంబం రామ్ రెడ్డి- స్వాతి దంపతుల కలను నెరవేర్చిన చైత్ర .

👉 జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ ఐ అండర్ 17 కు ఎంపికవ్వడం ప్రభుత్వ పాఠశాల క్రీడా విద్యార్థిణి సాధించిన చరిత్ర చైత్రారెడ్డి!

👉 మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసిన లెజెండ్ క్రికెట్ అకాడమీ కోచ్ సాహిల్- సోహెల్.

👉 తల్లిదండ్రులు రామ్ రెడ్డి- స్వాతి ప్రోత్సాహంతో 3సం”రాల కఠోర శిక్షణతో జాతీయ స్థాయి అండర్ 17 క్రికెట్ పోటీలకు రాష్టం నుండి అర్హత సాధించిన వైనం.

👉 పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామానికి చెందిన రామ్ రెడ్డి -స్వాతి దంపతుల పెద్ద కూతురు చైత్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కూడా క్రికెట్ లో ప్రదర్శిస్తున్న నైపుణ్యాన్ని పసిగట్టిన పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్ఎన్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాప కులు లొంక నర్సింలు గత రెండు సం”రాలుగా స్పాన్సర్షిప్ అందిస్తూ వెన్నంటి ఉంటూ ప్రోత్సహించడం అభినందనీయమని ఈ సందర్భంగా తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
👉 మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ భవిష్యత్తులో జాతీయ -అంతర్జాతీయ క్రీడా జట్టులో స్థానం సాధించే స్థాయికి ఎదగాలని గ్రామస్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *