మున్సిపల్ పోటీలో ఉర్దూ ఘర్ చైర్మన్?
👉గత 25సం”రాల నుండి కండువా మార్చని కాంగ్రెస్ వాది!
👉వార్డు నెం 20 నుండి పోటీకి సిద్ధం.
👉 ఉర్దూఘర్ చైర్మన్ పదవిని త్యాగం చేస్తా?
👉 ఉర్దూఘర్ చైర్మన్ సయ్యద్ జలాల్
నేటి ఇజం తాండూరు : రానున్న తాండూరు మున్సిపల్ ఎన్నికలలో పట్టణంలోని వార్డు నంబర్ 20 నుండి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఉర్దూఘర్ చైర్మన్ సయ్యద్ జలాల్ అన్నారు. శుక్రవారం నేటి ఇజం తో మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ, ఏనాడు కూడా మూడు రంగుల కండువా మార్చకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి ఓ సమాన్య కార్యకర్తగా సేవ చేశానని తెలిపారు. నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీకి తను చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం తనకు ఉర్దూ ఘర్ చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగిందని అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలలో తాండూరు పట్టణంలోని వార్డ్ నెంబర్ 20 నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్ సీటు కేటాయించాలని సయ్యద్ జలాల్ పార్టీ పెద్దలను కోరారు. వార్డ్ నెంబర్ 20 మున్సిపల్ కౌన్సిలర్ సీటును తనకు కేటాయిస్తే చైర్మన్ పదవిని కూడా త్యాగం చేస్తానని అన్నారు.

