మున్సిపల్ బరిలో భార్యాభర్తలు?
👉 పాత తాండూరు 14-15 వార్డుల నుండి బరిలోకి
👉 కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న మ్యాతరి ఇందు,మ్యాతరి సురేష్
నేటి ఇజం తాండూరు: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో పాత తాండూరు నుండి భార్యాభర్తలు బరిలో నిలిచేందుకు సమాయత్తమ వుతున్నారు. వివరాల్లోకి వెళితే పాత తాండూరుకు చెందిన భార్యాభర్తలు మ్యాతరి ఇందు,మ్యాతరి సురేష్ రానున్న మున్సిపల్ ఎన్నికలలో వార్డు నెంబర్ 14 నుండి మ్యాతరి సురేష్ అలాగే వార్డు నెంబర్ 15 నుండి సురేష్ భార్య మ్యాతరి ఇందు సురేష్ లు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ఆశీర్వాదంతో 14 -15 వార్డులలో పోటీలో నిల్చొని విజయాన్ని సాధించి రెండు వార్డుల కౌన్సిలర్ సీట్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి బహుమతిగా అందిస్తామని మ్యాతరి సురేష్ ధీమా వ్యక్తం చేశారు. కావున వార్డు నెంబర్లు 14 -15లోని ఓటర్లు, ప్రజలు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మనవి చేశారు.

