తాండూరు క్రికెట్టుకు సబ్ కుచ్ సహారా!

👉 ఎంతోమంది క్రీడాకారులను తీర్చి దిద్దిన వైనం

👉 జగన్నాథ్ సహారాలో నైపుణ్యం పొందిన క్రీడాకారులు

నేటి ఇజం :తాండూరు ::: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో క్రికెట్ అంటేనే సహారా క్రికెట్ అకాడమీఅని అందరికీ తెలిసిన విషయం విదితమే.

 అందులో భాగంగా నేడు విడుదలైన అండర్ 19 క్రికెట్ పోటీల సెలక్షన్ల స్కూల్ గేమ్ ఫెడరేషన్ నుంచి క్రికెట్ అండర్ 19 బాలికల విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు తాండూరుకు చెందిన సాయి సుధీష్ణ శెట్టి, అంచల్ పడిత్ లు ఎంపిక కావడం జరిగిందని, ఈ జాతీయ స్థాయి పోటీలు మధ్యప్రదేశ్ లోని శివపురి లో జనవరి ఒకటో తారీకు నుండి మొదలవుతున్నాయని తెలిపారు. అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్ 15 బాలికల విభాగంలో తాండూరు సహారా క్రికెటర్ అకాడమీ చెందిన భవిష్య రెడ్డి, ప్రతీక సెలెక్ట్ కావడం జరిగిందని బీసీసీఐ వన్డే టోర్నమెంట్ జనవరి 2 నుంచి విజయవాడలో నిర్వహించే ఈ టోర్నీలో వీళ్ళు పాల్గొంటారని అన్నారు. సహారా క్రికెట్ అకాడమీ నుండి భవిష్య రెడ్డి, ప్రతీక, సాయి సుదిష్ట శెట్టి, అంచల్ పండిత్ ఎంపిక కావడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా సహారా క్రికెట్ అకాడమీ కోచ్ లు జగన్నాథ్ రెడ్డి, శరత్ సింగ్, సతీష్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *