భారత మహిళా క్రికెట్ భవిష్య(త్) రెడ్డి?

భారత మహిళా క్రికెట్ భవిష్య(త్) రెడ్డి?

 👉బీసీసీఐ అండర్ 15 టోర్నీకి వరుసగా రెండోసారి ఎంపిక

👉కోచ్ సాహెల్ -సోహెల్ లకు అభినందనలు వెల్లువ

నేటి ఇజం:తాండూరు :: భారత మహిళా క్రికెట్ భవిష్యత్ క్రీడాకారుణిగా మన తాండూరు క్రీడాకారిణి భవిష్య రెడ్డి నిలుస్తుందని పలువులు క్రికెట్ అభిమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.వచ్చే నెల 2వ తేదీ నుంచి విజయనగరం వేదికగా జరగనున్న బీసీసీఐ మహిళల అండర్–15 వన్డే ట్రోఫీకి ఎంపికైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో భవిష్య రెడ్డికి వరుసగా రెండవసారి బీసీసీఐ అండర్ 15 లో చోటు దక్కింది. కరుణాకర్ రెడ్డి, మమతా రెడ్డిల కుమార్తె భవిష్య రెడ్డి చిన్నతనం నుంచే క్రికెట్ పట్ల మక్కువ పెంచుకుంది. స్థానిక సెయింట్ మార్క్స్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తూ నే అటు ఆటలోనూ రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. గత ఏడాది కూడా బీసీసీఐ ట్రోఫీకి ఎంపికై అద్భుత ప్రతిభ కనబరిచిన భవిష్య, ఇప్పుడు వరుసగా రెండోసారి ఎంపికై తన నిలకడను చాటుకుంది. తాండూరులోని లెజెండ్స్ క్రికెట్ అకాడమీలో కోచ్‌లు ఎండి సాహిల్, ఎండి సోహిల్ వద్ద భవిష్య శిక్షణ పొందుతోంది. ఆమెలోని నైపుణ్యాన్ని గుర్తించి, జాతీయ స్థాయికి ఎదిగేలా వారు ప్రోత్సహిస్తున్నారు. తాండూరు వంటి పట్టణం నుంచి ఒక క్రీడాకారిణి జాతీయ స్థాయి టోర్నీకి ఎంపికవ్వడం పట్ల అకాడమీ సభ్యులు, క్రీడాభిమానులు, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *