రాజకీయ ఒత్తిళ్లకు మసకబారుతున్న ఖాకీలు
👉మేరే పీచే కౌన్ హై మాలూం? డైలాగ్ కు దాసోహమేనా?
👉 ఒకప్పుడు థర్డ్ డిగ్రీ రుచిచూసిన కంత్రీ నాయళ్లే! నేడు కాలర్ ఎగరేస్తున్న వైనం?
👉 మినిస్టర్- ఎంపీ – ప్రభుత్వ విప్- ఎమ్మెల్యే- అధికార పార్టీ నాయకులు అందరూ వీళ్లను వాడుకుంటారు.. మరి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఖాకీ దుస్తులకు మరకలు అంటిస్తూ ప్రక్కకు తప్పుకుంటున్నారా?
👉 సమాజంలో ఏదైనా హత్యలు- హత్యాచారాలు అసాంఘిక కార్యక్రమాలు(అక్రమ ఇసుక రవాణా,, పిడిఎస్ బియ్యం,, ఎర్రమట్టి,, అక్రమ నాపరాతి రవాణా) తదితర ఏమి జరిగినా పైనుండి కింది వరకు ఉన్నటువంటి వైట్ కాలర్ (కాల్) నాయకుల లాలించే మాటలకు- బెధిరింపులకు-దాసోహమై విధులు నిర్వహిస్తున్న ఖాకీలకు నేడు సమాజంలో డి.ఎస్.పి,, ఎస్పీ,, డి ఐ జి,, డిజిపి ఆఫీస్ లకు ఆటాచ్ చేయడంతో ప్రత్యేక గుర్తింపు సంతరించుకోవడం దేనికి సంకేతం???
👉 అధికార పార్టీ అండదండలంటూ లేదా పలానా నాయకులు మా బంధువులు- చుట్టాలు- శ్రేయోభిలాషులు అంటూ విర్రవీగుతూ కాలర్ ఎగరేస్తూ మాట్లాడే వైట్ కలర్ నాయకుల భరతం పడుతూ శాంతి భద్రతల పరిరక్షణనే ధ్యేయంగా తమ కర్తవ్యం నిర్వహించే ప్రతి ఖాకీ కి సమాజం ఎల్లప్పుడూ జే జేలు పలుకుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే విషయాన్ని ఎప్పుడు గ్రహిస్తారు??
👉కానీ మన తాండూరు ప్రాంత విషయానికి వస్తే… అవసరానికి అందరూ తమ తమ పనులు పూర్తి చేసుకునేందుకు…. పోలీస్ స్టేషన్ గుమ్మం దగ్గర వేచి చూసే నాయకులు…. కర్తవ్య దీక్షలో మసక బారిన ఖాకిలకు ఏ వైట్ కలర్ నాయకుడైనా అండగా నిలిచారా???
👉 తాండూరులో విధులు నిర్వహిస్తున్న పోలీసులు జాగో పోలీస్ జాగో… తమరు తలుచుకుంటే పోయేదేముంది?? మహా అయితే మూడు నెలలలో ఆరు ట్రాన్స్ఫర్లు –లేదా ఆరు సరెండర్లలో మూడు సరెండర్లు కట్ అవుతాయి.. అంతే కదా??
👉 వైట్ కాలర్ నాయకులందరూ ఓటర్ల తర్వాత పోలీసులను కూడా వాడుకునేంతగా ఎలా ఎదిగారని గర్వించాలో- మదనపడాలో ఏమి తెలియని పరిస్థితి దాపరించింది ఈ వేళ?

