పేకాట స్థావరంపై పోలీసుల దాడి
👉 ఐదుగురు అరెస్టు
👉₹7230 నగదు స్వాధీనం
నేటి ఇజం పెద్దేముల్ : అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టిన పెద్దేముల్ పోలీసులు మండలంలోని గొట్లపల్లి గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గొట్లపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి పశువుల పాక పక్కన పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం ప్రకారం పేకాట స్థావరంపై దాడులు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారివద్ద ₹7230ల నగదును స్వాధీన పరుచుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్ వర్ధన్ మాట్లాడుతూ సమాజంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

