ఇసుక పర్మిషన్లు! మాఫియా చేతి రాజ్యమా?

ఇసుక పర్మిషన్లు!మాఫియా చేతి రాజ్యమా?

👉ఓకే ట్రాక్టర్ కు  ఒకేరోజు రెండు చోట్ల పర్మిషన్ మతలబ్ క్యా హై?

👉 టి టి డబ్ల్యూ ఆర్ ఎస్ గర్ల్స్ స్కూల్. జినుగుర్తి పేరుపై ఒకటి…
👉నుస్రత్ జహాన్ బేగం(ఇందిరమ్మ పథకం) గౌతాపూర్ పేరుపై 2వ పర్మిషన్..ఎలా?
👉ఒక పర్మిషన్ కావాలంటే ₹3 నుండి ₹5 వేలు ఇస్తే చాలంటా.. నిజమేనా?
👉 ట్రాక్టర్ కాగితాలను కూడా చూడని అధికారుల చేతివాటమా?
👉 కాగితాలు ఉన్నా!! లేకున్నా!! తమ చేతులు తడుపుతే చాలు పర్మిషన్ ఇస్తున్నారనే విమర్శలు దేనికి సంకేతం?
👉 నిజమైన ఇందిరమ్మ లబ్ధిదారులను కాగ్నా నదిలో కాలు పెట్టకుండా భయపెడుతున్న ఇసుక మాఫియా?
👉ఎన్ని ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చారో? కనీసం పోలీసు వాళ్లకు సమాచారం ఇవ్వని అధికారుల నిర్లక్ష్యం దేనికి సంకేతం?
👉 కమర్షియల్ నెంబర్ ప్లేట్ ( పసుపు రంగు )గల ట్రాక్టర్లకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలనే విషయం అధికారులకు తెలియదా?
👉 వ్యవసాయానికి ఉపయోగించే ప్రభుత్వానికి టాక్స్ చెల్లించని తెలుపు రంగు నెంబర్ ప్లేట్లు కలిగిన ట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వరాదనే కనీస సమాచారం తెలియని వైనం.
👉 నెంబర్ ప్లేట్ లేదంటూ ద్విచక్ర వాహనాలపై చలాన్లు వేసే పోలీసు అధికారులు! రాకెట్ స్పీడుతో తాండూరులో దూసుకుపోతున్న ఇసుక ట్రాక్టర్లను కూడా తనిఖీలు చేయాలని పలువురు వాహనదారులు మనవి చేస్తున్నారు..
👉 అనుభవం లేని డ్రైవర్లు… హెవీ లైసెన్సులు లేకుండా… కనీసం మీసం కట్టు లేని మైనర్లు కూడా ఇసుక ట్రాక్టర్లతో విన్యాసాలు చేస్తున్నా.. తనిఖీలు చేయని ఆర్టీవో ( రవాణా శాఖ) అధికారుల మౌనం దేనికి?

                                                ✍️✍️✍️కుమార్.
                                              నేటి ఇజం.తాండూరు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *