దుర్గామాత సేవలో బంటు మల్లప్ప
👉కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు
👉 అన్నదాన వితరణ కార్యక్రమం
నేటి ఇజం :తాండూరు పట్టణం సాయిపూర్ 9వ వార్డుకు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప మంగళవారం సాయిపూర్ హనుమాన్ దేవాలయం దగ్గర ప్రతిష్టించిన దుర్గామాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంటు మల్లప్ప మాట్లాడుతూ తాండూర్ ప్రాంత ప్రజలు ముఖ్యంగా రైతులు ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు అన్నారు.
అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటి సభ్యులు బంటు మల్లప్పను సతీసమేతంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్థానిక యువకులు, అభిమానులు, మిత్రులు 9వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

