సాయిపూర్ లో పులకరించిన తంగేడు పూలు.
👉 బతుకమ్మ వేడుకలకు కేరాఫ్ అడ్రస్ దీపా నర్సిములు
👉 తాండూరులోనే ఘనంగా బతుకమ్మ వేడుకలు
👉 పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్
నేటి ఇజం -తాండూరు : బతుకమ్మ వేడుకలకు కేరాఫ్ అడ్రస్ గా మాజీ వైస్ చైర్పర్సన్ దీప నర్సింలు సాయిపూర్ వార్డు 9 లో నిర్వహించే వేడుకలు అందరూ ఆకర్షిస్తూ ప్రత్యేకంగా నిలుస్తాయని మరోసారి నిజమైంది.
తాండూరు పట్టణం వార్డు నెంబర్ 9 సాయి పూర్ తాత గుడి ప్రాంగణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మను ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న అశ్వవాహన రూపంలో తయారుచేసిన ప్రత్యేక వాహనంలో దీపా నర్సింలు స్వగృహం నుండి డప్పు వాయిద్యాలతో, మిరమిడ్లు గొలిపే విద్యుత్ వెలుగుల మధ్య బతుకమ్మను ఊరేగిస్తూ తాత గుడి ప్రాంగణానికి తీసుకొచ్చారు. దీపానర్సింలు నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్యఅతిథిగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని బతుకమ్మ ఆడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో తాండూరు ప్రాంత నాయకులు, అభిమానులు, 9వ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

