కొట్టుకుపోయిన కొకట్ బ్రిడ్జ్ – ఇక రాకపోకలు బంద్
👉రాస్నం -ముద్దయిపేట్ గ్రామాలకు ఇక వెళ్లలేము
నేటి ఇజం -తాండూరు : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోకట్ బ్రిడ్జ్ తెగిపోయింది. బ్రిడ్జ్ ప్రారంభం ఐదు మీటర్ల దగ్గర నడుములోతు వరకు సిసి బెడ్ కొట్టుకుపోవడంతో ఇక మీదట రాకపోకలు పూర్తిగా నిలిచినట్లే.. ఇకమీదట తాండూరు నుండి రాస్నం – ముద్దయిపేట్ తదితర గ్రామాలకు తెగిపోయిన సంబంధాలు.

