ఘనంగా సాయన్న జయంతి వేడుకలు

ఘనంగా సాయన్న జయంతి వేడుకలు

👉పండుగల సాయన్న అడుగుజాడల్లో నడవాలి

నేటి ఇజం తాండూరు :ప్రజల ఆదరణ పొందిన పోరాటయోధుడు పండుగ సాయన్న జయంతి వేడుకలు నేడు తాండూరు లో ఘనంగా నిర్వహించారు..ఉదయాన్నే ప్రారంభమైన వేడుకల్లో భాగంగా, సాయన్న చిత్రపటానికి పుష్పాంజలి, ప్రత్యేక పూజలు, నిర్వహించారు, హైదరాబాద్ రోడ్డు మార్గాన ప్రభుత్వం ముదిరాజులకు కేటాయించిన స్థలంలో పండుగ సాయన్న జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరించారు.అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘ సభ్యులు జయంతి సభలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సాయన్న మానవతా విలువలకు ప్రతీక. ఆయన బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరం” అని అన్నారు.భక్తుల సహకారంతో సాయన్న జయంతి సాంప్రదాయబద్ధంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు కందుకూరి రాజ్ కుమార్, లొంక నర్సింలు, బాతుల వెంకటేష్, తాండూర్ ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు ఎస్పి రవికాంత్, ప్రధాన కార్యదర్శి ట్రైలర్ రమేష్, భరత్ కిషోర్,సుధాకర్,అంబరీష్,పంజుగుల శ్రీను, శివ ఖంజాపూర్, గోపాల్ కమాల్ పూర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *