శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి పల్లకి సేవ!

శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి పల్లకి సేవ!

👉 గుమస్తానగర్- సౌకర్ పేట్ లలో ఆధ్యాత్మిక వాతావరణం

👉 పల్లకి సేవలో పాల్గొన్న నాయకులు

నేటి ఇజం:తాండూరు:: తాండూరు పట్టణంలోని వార్డు నెంబర్ 26 గుమస్తానగర్ – సౌకర్ పేట్ లలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే వార్డు నెంబర్ 26లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయ జాతర సందర్భంగా అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛాణాలు, డప్పు వాయుధ్యాలు, సన్నాయి శ్లోకాలతో పురవీధులలో ఆదివారం శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్ మాంఖల్ రాఘవేందర్, గాజుల శాంతి కుమార్, పర్యాద రామకృష్ణ, రజక నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *