ఒంటిపై బంగారంతో ఉన్న వృద్ధ మహిళలే టార్గెట్?

ఒంటిపై బంగారంతో ఉన్న వృద్ధ మహిళలే టార్గెట్?

👉 మాటలతో నమ్మించడం ఆ తర్వాత గొంతు నొక్కి – కు మూసి చంపడం – బంగారంతో పారిపోవడం.

👉 దూర ప్రాంత నిర్మానుష్య ప్రదేశాలే హంతకుల సేఫ్ జోన్.  

👉 ప్రధాన నిందితులు కరీంబి ఆమె భర్త రెహమాన్ వీళ్లకు సహకరించిన నయీమ్ ముగ్గురు పోలీసులు అదుపులో?

👉 అప్పు డబ్బులు అడిగినందుకు ఒకరు,! బంగారం టార్గెట్ చేసి మరొకరి హత్య.

👉 బంగారం ఉన్న వృద్ద మహిళలే టార్గెట్.

👉 తాండూరులో కిడ్నాప్ – హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్ తోల్ కట్ట  ఫామ్ హౌస్ ప్రక్కన నిర్మానుష్య ప్రదేశంలో  హత్య చేసి పూడ్చడం.

👉 వికారాబాద్ జిల్లా తాండూరులో నమోదైన వరుస మిస్సింగ్ కేసులు 

👉 వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా ఆబెదా బేగం గత మే నెల 4వ తారీఖు ఆచూకీ లభించడం లేదని ఆబేదా బేగం కొడుకు ఫిర్యాదు చేశారు.

👉 రెండవ కేసు తాండూరు పట్టణం యాలాల లిమిట్స్ లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబీ బేగం గత రెండు నెలల క్రితం మార్చి నెలలో యాలల మండల పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

👉 తాండూర్ ప్రాంతంలో రెండు నెలల కాలవ్యవధిలో వరుసగా రెండు మిస్సింగ్ కేసులు నమోదు పట్ల దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

👉 ఇద్దరు వృద్ధ మహిళలను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలు తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన కరీo బీ ఆమె భర్త రెహమాన్ హత్యకు సహకరించిన మొయినాబాద్ రామోజీలో పనిచేసే నయీమ్ ముగ్గురు కలిసి బంగారంతో ఉన్న తెలిసిన (ముఖ పరిచయం ఉన్న ) వృద్ధ మహిళలను మాయ మాటలతో నమ్మిస్తూ ఆపై మద్యం కొనుగోలు చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం సేవించిన తర్వాత గొంతు నుమిలి – ముక్కు నొక్కి పెట్టి శ్వాస అందకుండా చేసి హత్య చేయడం ఆ తర్వాత వృద్ధ మహిళల ఒంటిపై ఉన్న బంగారంతో ఉడాయించడం ఆపై ఏమి తెలియనట్టు మళ్లీ తాండూరు లోనే దర్జాగా తిరగడం వీళ్ళ నిత్య కర్తవ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *