బంగారూ! జర పైలం సెల్లీ.!
👉కామాంధుల చేతిలో రాలిపోతున్న పసి మొగ్గలు.
👉 నిన్న బషీరాబాద్ మండలంలో ఏడేళ్ల (7)చిన్నారిపై అఘాయిత్యం మరవకముందే?
👉 నేడు యాలాల మండలం లో మరో సంఘటన.
👉 2 రోజులలో 2 ఫోక్సో కేసులతో తాండూరులో చరిత్ర సృష్టించిన కామాంధులు
👉 నిత్యకృతంలా మారిన కామ పిశాచుల డ్యాష్ -డ్యాష్.. చేష్టలు.
👉 అభం -శుభం తెలియని చిన్నారి పసి మొగ్గలపై చాక్లెట్ల ఆశతో పాడుబడ్డ ఇళ్లలోకి తీసుకెళ్లి…(తలుచుకుంటేనే) శరీరంపై రోమాలే నిక్కబోయేలా ఉన్న సందర్భం నేడు ప్రతి తాండూరు బిడ్డలను ఆవలించింది.
👉 పందులు- కుక్కల కన్నా హీనంగా ( లం –లు ) తాను తల్లి గర్భం నుంచి బయటికి వచ్చే దారిపై దాడి చేస్తున్న నీచాతినీచ దుర్మార్గులు.. నేడు సమాజంలో ఏమీ తెలియని అమాయకుల మాదిరి తిరుగుతున్నారని మర్చిపోకండి.
👉 తల్లిదండ్రులారా జర జాగ్రత్త?
👉 ఎప్పుడూ పని -డబ్బు- వ్యాపారం అనే ధ్యాసలో ఉండకండి?
👉 మనవాడే- తెలిసిన వాడే కదా! అంటూ ఏమీ తెలియని పూలతోటలోని పసి మొగ్గలకు కాపలా పెట్టకండి?
👉కామంతో కళ్ళు మూసుకున్నవాడు ఎప్పుడు తెంపేస్తాడో!!ఆ పసి మొగ్గలను,,,జర పైలం? అమ్మలారా!!!
👉 తల్లిదండ్రులారా ముఖ్యంగా పిల్లలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్న విధంగా (గుడ్ టచ్ –బ్యాడ్ టచ్ )పై పిల్లలకు తెలియజేయండి.
👉 మన సంప్రదాయ దుస్తులనే.. మన పిల్లలు ధరించేలా చూడాలి.
👉 పాశ్చాత్త దుస్తులతో సమాజంలో నేడు పెరుగుతున్న అఘాయిత్యాలు.
👉మన ఇంట్లో కాదు. కదా! ఎక్కడో జరిగింది. అయ్యో పాపం అంటూ మొసలి కన్నీరు కాల్చకండి… రేపు మన ఇంట్లో కూడా జరగవచ్చు.. తస్మాత్ జాగ్రత్త!
👉 ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పే తల్లిదండ్రులు…. ఇంట్లో ఉన్న మగ పిల్లలకు కూడా నీకంటూ ఇంట్లో ఒక చెల్లి -అక్కా – అమ్మ ఉందని సమాజంలోని మహిళలను కూడా గౌరవించేలా క్రమశిక్షణ నేర్పించండి. 🙏
✍️✍️✍️నేటి ఇజం–కుమార్

