మేవాడ్ కా రాజా! భారత్ దేశ్ కా భాద్ షా.!
👉 కేవల్ రాజ్ పుత్ర్ కా నహి! పురా భరత్ దేశ్ కా మహానీయు రాణా ప్రతాప్!
👉 అట్టహాసంగా రాణా ప్రతాప్ సింగ్ ఠాగూర్ జయంతి వేడుకలు.
👉 బైక్ ర్యాలీలో ఉట్టిపడిన మహిళల భరతనారి సాంప్రదాయ వేషధారణ!
👉 మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలలో…భవానీ మాత ఖడ్గం చేతబట్టి! ఝాన్సీ లక్ష్మీబాయి ధీరత్వానికి ప్రతీకగా హైందవ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన రాజ్ పుత్ మహిళా సోదరీమణులు!
👉 బాబర్ -అక్బర్ – అలెగ్జాండర్ చరిత్రలను చదివించిన మనకు!!నేటి యువత అలాగే భవిష్యత్ తరాలకు రానా ప్రతాప్ ఠాకూర్, చత్రపతి శివాజీ మహారాజ్ హిందూ హైందవ సామ్రాజ్య స్థాపనకై పోరాడిన మహనీయుల చరిత్రను తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్బిఓఎల్ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
👉 మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలు శనివారం ఖాoజాపూర్ గేట్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బైక్ ర్యాలీగా బయలుదేరి చత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధానికి బయలుదేరే సమయంలో ఖడ్గాన్ని అందించిన కాళికామాత దేవాలయం చేరుకొని, అక్కడినుండి వినాయక్ చౌక్, పాత కూరగాయల మార్కెట్, గాంధీచౌక్ మీదుగా సభా ప్రాంగణం భద్రేశ్వర చౌక్ కూడలికి హిందూ హైందవ దేశభక్తి సాంప్రదాయం ఉట్టిపడేలా కొనసాగింది.
👉 ఎన్నో రాజ్యాలను జయించి, భరతమాత గడ్డపై దండేత్తిన అక్బర్,-బాబర్ మిగతా డ్యాష్ -డ్యాష్ రాజులను తరిమి తరిమి కొట్టిన చరిత్ర మహా రాణా ప్రతాప్ సింగ్ చరిత్ర అంటూ… హైందవ సామ్రాజ్యం కోసం పుట్టిన దేశం కోసం సేవ చేసేందుకు మహారాణా ప్రతాప్ సింగ్ అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా పలువులు పేర్కొన్నారు.
👉 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, బిజెపి ఫ్లవర్ లీడర్ నాగారం మల్లేశం, బషీరాబాద్ పిఎసిఎస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, రాజ్ పుత్ సంఘం న గౌరవ అధ్యక్షులు ఠాకూర్ సూరజ్ సింగ్, అధ్యక్షులు దిలీప్ సింగ్ ఠాకూర్, జనరల్ సెక్రెటరీ శివానంద్ సింగ్ ఠాకూర్ రాజ్ పుత్ సంఘం సభ్యులు, సంఘం మహిళా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.✍️✍️నేటి ఇజం. కుమార్.

