డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై పిర్యాదు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై పిర్యాదు.

👉 కలెక్టర్ కార్యాలయంలో పిర్యాదు చేసిన భాజపా నాయకులు  

👉 పంపిణీ చేసిన ఇళ్లను వెనక్కు తీసుకోవాలి

నేటి ఇజం తాండూరు :: ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అధికారుల పర్యవేక్షణ లేకుండా కేవలం ఒకే సామాజిక వర్గానికి 200 ఇళ్ళ ను కేటాయించడం పైగా లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడంపై తాండూరు భాజపా నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ తాండూరు పట్టణ నిరుపేద ప్రజలకు చెందాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పడంపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో పిర్యాదు చేసినట్లు తెలుపుతూ 200 ఇండ్లను ప్రైవేటు చారిటబుల్ ట్రస్టుకు దారాదత్తం చేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. ప్రైవేటు చారిటబుల్ ట్రస్ట్ పంపిణీ చేసిన 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే వెనక్కు తీసుకోవాలని అలాగే సంబంధిత ట్రస్ట్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాహు శ్రీలత, జిల్లా దిశా నెంబర్ అంతారం లలిత, తాండూరు భాజపా పట్టణ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, 33 వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు బండారు శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షుడు దోమ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *