వికసించిన కందనెల్లి విద్యా కుసుమం.
👉ఎం జె పి పాఠశాల టాపర్ గా నవ్యశ్రీ
👉 మొత్తం 75 మంది పరీక్ష రాయగా 72 మంది ఉత్తీర్ణత
👉 అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలకు ప్రచారం చేసే నాయకులకు….
👉 ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ స్కూలు విద్యార్థుల విజయం పట్టదా ?
👉 ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే నాయకులకు!! ప్రభుత్వ పాఠశాలలలో చదివే పేద విద్యార్థుల విజయాన్ని ప్రచారం చేసే ఆలోచన ఉంటే మంచిదే కదా??
నేటి ఇజం తాండూరు ::మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాల పదవ తరగతి లో నవ్యశ్రీ 539 (600) మార్కులు మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపల్ రూపా రాణి, ఉపాధ్యాయుల బృందం నవ్యశ్రీని అభినందించారు. పదో తరగతిలో ఈ ఏడాది 75 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 72 మంది పాసయ్యాలని తెలిపారు. అశ్విత (527) ,నందిని (522) మార్కులు సాధించినట్లు తెలిపారు. పెద్దముల్ మండలం కందనెల్లికి చెందిన బింగి వెంకట్ కూతురు నవ్యశ్రీ పాఠశాలలోనే అత్యధిక మార్కులు సాధించడం పట్ల గ్రామ పెద్దలు యువకులు అభినందనలు తెలిపారు.

