ఆపితే శాంతీలు లేచిపోతాయి!
బరితెగించిన ఇసుక మాఫియా!
👉 ఆపేందుకు వచ్చిన SI –పోలీసు రక్షక్ వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ తో ఢీ కొట్టిన వైనం
👉 ప్రమాదం నుండి బయటపడ్డ ఎస్సై శ్రీశైలం యాదవ్- సిబ్బంది
👉రెచ్చిపోతున్న ఇసుక మాఫియాకు ఎవరి అండా దండా?
👉 గతంలోనూ ఇదే బషీరాబాద్ మండలంలో కానిస్టేబుల్ కాళ్లు విరిగిన ఘటన మరవక ముందే మళ్లీ చోటు చేసుకోవడం గమనార్హం?
👉 తాండూరు ప్రాంతంలోని కాగ్నా నదిలో వీర విహారం చేస్తున్న ఇసుక మాఫియాకు అడ్డువేసే టాస్క్ ఫోర్స్ కు సంకెళ్లు ఎవరు వేశారు?
👉 వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల పరిధిలో ఘటన*
నేటి ఇజం :తాండూరు ::అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న సమాచారాన్ని తెలుసుకున్న ఎస్సై తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లి ఇసుక ట్రాక్టర్లను ఆపేందుకు ప్రయత్నించగా సాక్షాత్తు ఎస్సై వాహనాన్ని పట్టపగలు ఢీ కొట్టి మమ్మల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టుగా.. బరితెగించిన ఇసుక మాఫియా సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో చోటుచేసుకుంది.
పోలీస్ వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ తో ఢీ కొట్టిన ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బరితెగించిన ఇసుక మాఫియా పై కేసులు నమోదు చేసేందుకు పోలీసు ఉన్నదా అధికారులు చర్యలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

