మానవత్వమే -మంటగలిసిన వేళ?
👉 పాడే రమ్మనలేదు? కానీ ఇంటి యజమానే పంపించాడు!
👉 మారని ఇంటి యజమానుల తీరు?
👉 ఇంటి ముందు అంతిమ సంస్కారాల చివరి కార్యక్రమాలకు నోచుకోని మాతృమూర్తి పార్థివ దేహం?
👉 కాటికి వెళ్లేందుకు సమయం ఉన్నా.. నిన్నటి నుండి కాటికి కాపలాగా మాతృమూర్తి పార్థివ దేహం.
👉 ఆసుపత్రిలో మృతి చెందిన మాతృమూర్తి శవ పేటికను ఇంట్లొకి అనుమతించని ఇంటి యజమాని.
👉 సొంత ఇల్లు లేక.. ఇంటి యజమాని అనుమతించక… గత్యంతర పరిస్థితులలో… కాటికి వెళ్లేందుకు సమయం ఉన్నా కూడా… స్మశాన వాటిక దగ్గరే కాపలాగా మారిన మాతృమూర్తి మృతదేహం.
👉 నిండు వేసవిలో చల్లని గాలులకు… స్మశాన వాటిక దగ్గర చేరిన ఆ మాతృమూర్తి పార్థివ దేహాన్ని వదిలి వెళ్ళేందుకు ఆత్మ కూడా కన్నీళ్లు పెడుతూ ఘోశిస్తున్న వైనం.
👉 తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మృతి చెందిన మాతృమూర్తి జీవిత చరిత్రపై (అట్లుండే -ఇట్లుండే నే రామ )అంటూ పాటలు ఆలపించే కళాకారులు సైతం స్మశానం దగ్గర ఉంచిన పార్థివ దేహాన్ని చూస్తూ కన్నీటి పర్యావంతమైన దృశ్యం.
👉 అద్దె ఇల్లే… తన అంతమ సంస్కరణకు అడ్డంకిగా మారుతుందని పాపం ఆ మాతృమూర్తికి తెలియదేమో పాపం. నెల వచ్చేలోపు అద్దె కరెక్ట్ గా ఇచ్చేది.. ఆ పిచ్చి తల్లి?
👉 అంతిమ సంస్కరణలకు ముందే కాటికి కాపలాగా మారిన ఈ సంఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు… తాండూరు నడిబొడ్డున.. వార్డ్ నెంబర్ 23 వాల్మీకి నగర్ లో చోటు చేసుకోవడం గమనార్హం.
👉 ఆ మాతృమూర్తి పార్థివ దేహాన్ని తన సొంత ఇంటి దగ్గరకు అనుమతించని ఆ గొప్ప మహోన్నత వ్యక్తి…. భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం కొసమెరుపు?
👉 మనం ఇలా ఉండాలి అలా ఉండాలే?. అనే హిందూ హైందవ సంఘాలు ఇలాంటి సంఘటనలపై దృష్టి సాధించాలని పలువురు ప్రజలు పేర్కొంటున్నారు.

