మాతా శిశు ఆసుపత్రిలో అసలు ఏమి జరుగుతుంది?
👉 ఆస్పత్రి సిబ్బంది మధ్య సమన్వయ లోపం దేనికి సంకేతం?
👉 నేను హెడ్ నర్స్ & నేను హెడ్ నర్స్ అంటూ చేసే డ్యూటీలపై రాద్ధాంతం ఎలా?
👉 15 నెలలుగా ఒకే విధమైన డ్యూటీ వేస్తున్నారంటూ హెడ్ నర్స్ జయశ్రీ ఎందుకు ఫిర్యాదు చేశారు?
👉 హెడ్ నర్స్ జయశ్రీ ఫిర్యాదుపై ఎంక్వయిరీకి వచ్చిన ఆసుపత్రి సూపరిండెంట్ ఏమి చేశారు?
నేటి ఇజం తాండూరు : రాష్ట్రంలోనే అత్యధిక ప్రసూతి చికిత్సలు చేస్తున్నారంటూ జాతీయ స్థాయిలో కాయకల్ప అవార్డులను సొంతం చేసుకున్న తాండూరు జిల్లా ఆసుపత్రి -మాతా శిశు ఆసుపత్రిలో గత రెండు రోజులుగా వినిపిస్తున్న వదంతులతో జిల్లా ఆస్పత్రి పేరును మసక బారేలా చేస్తున్నాయని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అసలు జిల్లా ప్రభుత్వాసుపత్రి -మాతా శిశు ఆసుపత్రిలో ఏమి జరుగుతుందనే సందేహం యావత్ తాండూరు ప్రజలలో నెలకొంది.
అసలు విషయానికి వస్తే జిల్లా ఆసుపత్రి మాత శిశు ఆసుపత్రిలో మేము సీనియర్లు అంటూ కొందరు హెడ్ నర్సులు గత కొన్ని నెలలుగా ఒకే రకమైన విధులను నిర్వహిస్తున్నారని… మేము కూడా హెడ్ నర్సులమే కదా మాకు ఆరోగ్యకరమైన సమస్యలు ఉన్నాయని.. ఆరోగ్య కారణాల వలన గత 15 నెలలుగా ఒకే విధమైన డ్యూటీ వేస్తున్నారని హెడ్ నర్స్ జయశ్రీ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. హెడ్ నర్స్ జయశ్రీ ఫిర్యాదును దర్యాప్తు చేసేందుకు వచ్చిన ఆసుపత్రి జిల్లా సూపరిండెంట్ వినయ్ కుమార్ జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రిలో నిత్యం ఒకే రకమైన డ్యూటీ చేస్తున్న ఆస్పత్రి సిబ్బందిని రోమన్ పద్ధతిలో తమ విధులు నిర్వహిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. ఇన్నేళ్లుగా ఎప్పుడూ లేని ఆదేశాలు ఈరోజు మా పై ఎలా అంటూ కొంతమంది సిబ్బంది కావాలనే సూపరిండెంట్ వినయ్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హెడ్ నర్స్ జయశ్రీ తెలిపారు. అలాగే హెడ్ నర్స్ జయశ్రీ మాట్లాడుతూ తీసుకుంటున్న జీతానికి తగ్గట్టు విధులు నిర్వహిస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని- నిత్యం ఒకే రకమైన డ్యూటీ లేకుండా రోమన్ పద్ధతిలో కచ్చితంగా డ్యూటీలు చేయాల్సిందే అంటూ సూపరిండెంట్ వినయ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు, అన్నటువంటి మాటలు కొంతమంది సిబ్బందికి ఇబ్బందికరంగా మారడంతోనే ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఏది ఏమైనా జిల్లా ఆసుపత్రి – మాతా శిశు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆస్పత్రికి వచ్చే రోగుల సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

