తాండూరులో నకిలీ సిగరెట్ల దందా..!

తాండూరులో నకిలీ సిగరెట్ల దందా..?

👉 తెల్ల  చ ర్మం వ్యాపారుల  కబంధ హస్థాలలో అక్రమ నకిలీ సిగరెట్ల వ్యాపారం?

👉 ఐటిసి డీలర్షిప్ తీసుకొన్న తాండూరు బడా ఎర్ర చర్మం వ్యాపారులు! స్టాక్ ఉన్నా కూడా లేదని.,, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వైనం! దేనికి సంకేతం?

👉 తాండూరు ఎర్ర చర్మం బడా వ్యాపారులకు…. వరంలా మారిన వలస వచ్చిన రాజస్థానీ వ్యాపారులు. నిజమే కదా?

👉 నిత్యం లక్షలలో అక్రమ నకిలీ సిగరెట్ల వ్యాపారం జరుగుతున్నా!నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం.?

👉 ఇందులో ఎవరి వాటా ఎంత? తనిఖీలలో జాప్యం ఎలా?

👉 ధూమపానం అంటేనే ప్రమాదకరం!అందులో ఎంత దోచుకున్న ఎవరు మనకు అడిగేది అన్న చందంగా తాండూరు చిరు వ్యాపారస్తుల ఆటలు కరెక్ట్ కదా?

👉గోల్డ్ ప్లేక్ లైట్స్ పేరుతో డూప్లికేట్ సిగరెట్ల విక్రయం?

👉అసలు ప్యాకెట్లతో పోలిక… వినియోగదారులు గందరగోళం?

👉అక్రమ దందాపై విచారణ చేపట్టాలని వినియోగదారుల డిమాండ్

నేటి ఇజం :తాండూరు:: తాండూరు నియోజకవర్గ ప్రాంతాల్లో నకిలీ సిగరెట్ల దందా జరుగుతున్నట్లు వినియోగదారుల నుంచి వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఐటీసీ సంస్థకు చెందిన గోల్డ్ ప్లేక్ లైట్స్ బ్రాండ్ పేరుతో డూప్లికేట్ సిగరెట్లు మార్కెట్లో విక్రయమవుతున్నట్లు సమాచారం. పట్టణంలోని పలు రిటైల్ దుకాణాల్లో ఈ నకిలీ ప్యాకెట్లు లభ్యమవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. అసలు బ్రాండ్కు పోలికగా ప్యాకింగ్ ఉండటంతో సాధారణ వినియోగదారులు సులభంగా మోసపోతున్న పరిస్థితి నెలకొంది. స్థానిక వ్యాపారులు, వినియోగదారుల వివరణ ప్రకారం అసలు, నకిలీ సిగరెట్ ప్యాకెట్లు బయటకు చూస్తే దాదాపు ఒకేలా కనిపిస్తున్నాయి. ప్యాకింగ్ డిజైన్, హెచ్చరికల ముద్రణ, బ్రాండ్ లోగో కూడా సమానంగా ఉండటంతో తేడా గుర్తించడం కష్టమవుతోందని వారు తెలిపారు. మార్కెట్ ధర కంటే 30 నుంచి 40 శాతం వరకు తక్కువ ధరకు ఈ ప్యాకెట్లు సరఫరా అవుతు న్నట్లు సమాచారం. అధికారిక డీలర్ల ద్వారా కాకుండా మధ్య వర్తుల ద్వారా ఈ సరుకు సరఫరా అవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*ఆరోగ్యానికి ముప్పు… ప్రభుత్వానికి ఆదాయ నష్టం..*

నకిలీ సిగరెట్ల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నియంత్రణలో లేని పొగాకు పదార్థాలు.

ప్రమాదకర రసాయనాల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అదేవిధంగా నకిలీ సిగరెట్ల విక్రయం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీతో పాటు ఇతర పన్నుల రూపంలో భారీ ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు సూచిస్తున్నాయి. ఈ అక్రమ దందాపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వినియోగదారులు అప్రమత్తంగా ఉండి అధికారిక డీలర్ల వద్ద నుంచే సిగరెట్లు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

లేబుల్లో సూక్ష్మ తేడాలు.. గుర్తించడం కష్టం..?

అసలు గోల్డ్ ప్లేక్ లైట్స్ ప్యాకెట్పై గోల్డ్ రంగు స్పష్టంగా మెరుస్తూ ఉండగా, నకిలీ ప్యాకెట్లలో అది కొంత మసకబారినట్లు కనిపిస్తున్నట్లు వినియోగ దారులు చెబుతున్నారు. కొన్ని ప్యాకెట్లలో ముద్రణ స్పష్టత లేకపోవడం, అక్షరాల రంగులో తేడా ఉండటం, ప్యాకెట్ నాణ్యత తక్కువగా ఉండటం వంటి లక్షణాలు గమనించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఇవి సూక్ష్మ తేడాలు కావడంతో సాధారణంగా గుర్తించడం కష్టమవుతోందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *