13 సం”ల కల నెరవేరిన వేళ!
👉నావంద్గీ ( బషీరాబాద్)లో హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలుకు స్టాప్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం.
👉 చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
👉 వికారాబాద్ జిల్లా నావాండ్గి (బషీరాబాద్)లో హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలును ఆపాలంటూ గత 13 సంవత్సరాలుగా పోరాటాలు చేసి, ఎన్నో వినతి పత్రాలను సమర్పించిన బషీరాబాద్ ప్రజల కోరిక నేడు శుక్రవారం 27వ తేదీ నుండి హుబ్లీ ఎక్స్ప్రెస్ రైలు నావాండ్గి (బషీరాబాద్)లో స్టాప్ ఏర్పాట్లు చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.
👉నా మీద నమ్మకం ఉంచినందుకు బషీరాబాద్ ప్రజలకు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
👉మా చేవెళ్ల ప్రాంత ప్రజలకు ఎంతో అవసరమైన పని చేసిన ప్రధాని మోదీ , రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ , వి. సోమన్న , SCR అధికారులు GM శ్రీవాత్సవ , DGM లు ఉదయ్ నాథ్, కిరణ్ , CPRO B. శ్రీధర్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
👉హుబ్లీ ఎక్స్ ప్రెస్ రైలులో నావంద్గీ నుంచి హైదరాబాద్ కు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ప్రయాణికులతో పాటు ప్రయాణం చేస్తూ బయలుదేరారు.

