పట్టణ అభివృద్ధికి పాటుపడాలి
👉నూతన యువ కౌన్సిలర్లకు సన్మానం
👉 ఏఆర్ క్యాటరింగ్ అనిత రమేష్ టైలర్
నేటి ఇజం :తాండూరు :: తాండూరు పట్టణ అభివృద్ధికై పాటుపడాలని తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ ఏ ఆర్ క్యాటరింగ్ యాజమాన్యం అనిత రమేష్ టైలర్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణ మున్సిపల్ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన యువ కౌన్సిలర్లు వార్డ్ నెంబర్ 33 శ్రీకాంత్ రెడ్డి, వార్డు నెంబర్ 23 అంతారం కిరణ్ ముదిరాజ్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏఆర్ క్యాటరింగ్ యాజమాన్యం అనిత రమేష్ టైలర్ మాట్లాడుతూ చిన్న వయస్సులో జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీలో పోటీ చేసి గెలుపొందడం అనడం మినహాయిస్తే గెలిపించిన వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వార్డు ప్రజల కష్టాలను, కనీస అవసరాలను తీర్చే గొప్ప సేవ చేసే భాగ్యాన్ని తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త పర్యాద రామకృష్ణ, యువ నాయకులు సందీప్ రెడ్డి, రజక నరసింహ, కౌన్సిలర్ అభ్యర్థుల మిత్రబృందం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

