మున్సిపల్ నీరా(జ)నాలు బాలరాజుకే.
👉సాయిపూరుకే మున్సిపల్ కుర్చీ
👉 ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం
👉 పక్కా ప్రణాళికలతో బయలుదేరిన బాల్ రెడ్డి ప్రయాణం
👉నేడు 11 గంటలకు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు
👉 వైస్ చైర్మన్ కుర్చీపై మైనార్టీ నేత అబ్దుల్ రజాక్
నేటి ఇజం :తాండూరు::తాండూరు ప్రథమ పౌరురాలుగా కాంగ్రెస్ పార్టీ నుండి 12 వ వార్డు నుండి భారీ మెజార్టీతో గెలుపొందిన పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి చైర్ పర్సన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 36 వార్డులకు గాను కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను కైవసం చేసుకొంది. మున్సిపల్ చైర్మన్ బీసీ జనరల్ కు రిజర్వు అయిన సంగతి విధితమే. ఇప్పటికే గెలిచిన 19 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులోని ఓ హోటల్లో క్యాంపు ఏర్పాటు చేసింది.ఈ క్యాంప్ లోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏకాభిప్రాయం ద్వారాచివరకు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ గా పట్లోళ్ల నీరజ , మైనార్టీ కోటాలో వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్ లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో చేపట్టనున్న ప్రమాణ స్వీకారం లో సీల్డ్ కవర్ ద్వారా పై ఇద్దరి పేర్లు ప్రకటించనున్నారు.

