వార్డు నం. 23లో (సత్య)మనోహరం
👉 వార్డు ఇంచార్జ్ భరత్ రెడ్డి దిశా నిర్దేశం
👉 మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి బలం
👉 బీసీ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు మంజుల అదనపు తోడ్పాటు
👉 రాజశేఖర్, ప్రభాకర్, సందీప్ పురుషోత్తంల చాతుర్యం.
నేటి ఇజం :తాండూరు :: తాండూరు పట్టణం వార్డు నెంబర్ 23 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొరిశెట్టి సత్యమూర్తి ప్రచార పర్వాన్నే విజయోత్సవ ర్యాలీగా నిర్వహిస్తూ యావత్ తాండూరులోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాండూరు శాసనసభ్యులు బొయ్యని మనోహర్ రెడ్డి ఆశీస్సులతో 23వ వార్డు ఇంచార్జ్ భరత్ రెడ్డి దిశా నిర్దేశంతో , మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి బలం చేకూరుతూ… బిసి సంఘం ఉపాధ్యక్షురాలు మంజులగోపి అదనపు తోడ్పాటు, వార్డు ఇన్చార్జ్ లు రాజశేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సందీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి తదితరుల మెరుగైన చాతుర్యంతో దొరిశెట్టి సత్యమూర్తి 23వ వార్డు వాల్మీకి నగర్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయకేతనం ఖాయమని స్థానిక వార్డు ప్రజలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎల్లప్పుడూ పేద ప్రజల కష్ట: సుఖాల కోసం తపించే మంచి మనిషిగా- నిరుపేదల అభ్యున్నతికి కృషి చేసే వ్యక్తిగా అలాగే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆశీస్సులతో వాల్మీకి నగర్ 23 వ వార్డులో పోటీ చేయడం ఈ వార్డు ప్రజల అదృష్టమని తెలిపారు.

