ఓటరు ముసాయిదా సవరణ చేయాల్సిందే?
👉 రోహిత్ అన్న ఆదేశిస్తే కౌన్సిలర్ పోటీకి సైతం సిద్ధం
👉 రోహిత్ అన్న నిర్ణయం పార్టీ ఆదేనుసారం పార్టీకి అండగా ఉంటా?
👉6వ వార్డ్ బి ఆర్ ఎస్ యువ నాయకులు కావలి తమ్మప్ప.
నేటి ఇజం తాండూరు: తాండూరు పట్టణంలోని ఇంద్ర నగర్ వార్డ్ నెంబర్ 6 లోని ఓటరు జాబితాలో స్థానికంగా లేని వందలాది నకిలీ ఓటర్లను ఓటర్ ముసాయిదాలో నుండి తొలగించాలని 6వ వార్డు బిఆర్ఎస్ యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వీరాభిమాని బోయ కావలి తమ్మప్ప గురువారం మున్సిపల్ అధికారులకు మెమొరోండం అందజేశారు. ఈ సందర్భంగా యువ నాయకుడు బోయ కావలి తమ్మప్ప మాట్లాడుతూ వార్డ్ నెంబర్ 6 లోని వందలాది బోగస్ ఓటర్లను తొలగించాలని అధికారులకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.
అలాగే ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశిస్తే గత 7 సంవత్సరాలుగా బి ఆర్ ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ఎంతో కష్టపడ్డానని!! నా శ్రమను గుర్తించి బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సీటు కేటాయిస్తే కచ్చితంగా ఆరవ వార్డులో బిఆర్ఎస్ జండా ఎగరవేసేందుకు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో నిలిచి కృషి చేస్తానని అన్నారు.

