దొరా నీ కాళ్లు మొక్కుతా! బాంచెన్!!

దొరా నీ కాళ్లు మొక్కుతా! బాంచెన్!!

👉 అధికార దాహం! మదమెక్కిన మొహంతో కన్నయ్య దొర అరాచకం? నిజమేనా?

👉కాళ్లపై పడి వేడుకున్నా కణుకరించలేదు?

👉ఈ రోడ్డు నా అయ్యా సీతారెడ్డి -రాం చంద్రారెడ్డి జాగీరు రా?

👉రోడ్డును కబ్జా చేసి కంపౌండ్ నిర్మించిన కన్నయ్య దొర@ జితేందర్ రెడ్డి?

👉గతంలోనే ప్రభుత్వం వేసిన రోడ్డు ఉండే.. దానిలోనే మేము పోయేటోళ్ళం?

👉 ప్రశ్నించిన యువకుడు మోసీన్ పై ముగ్గురు వ్యక్తులతో దాడిచేసి తీవ్రంగా కొట్టారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ… ఆత్మహత్య చేసుకుంటానని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కిన యువకుడు మోసీన్.

👉సుమారు 3 నుండి 4 గంటల వరకు కనీసం తాగడానికి మంచి నీరు కూడా లేక వాటర్ ట్యాంక్ పైనే ఉంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం!

👉 ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, పోలీసు ఉన్నతాధికారులు రూరల్ సీఐ, ఎస్సై ఎంతగా బతిమిలాడినా కూడా పట్టు వదలకుండా దొర కబ్జా చేసిన రోడ్డును వదిలేదాకా నీళ్ల ట్యాంకుపై నుండి కిందికి దిగని యువకుడు మోసీన్.

👉 చేసేదేమీ లేక చివరకు గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అలాగే మొత్తం పెద్దేముల్ గ్రామ ప్రజల సమక్షంలో దొర అని పిలువబడే జితేందర్ రెడ్డి కబ్జా చేసిన రోడ్డును జెసిబి సహాయంతో ప్రహరీ గోడ నిర్మాణాన్ని కూల్చివేయడంతో శాంతించిన బాధితుడు మోసిన్ వాటర్ ట్యాంక్ పై నుండి కిందకు దిగడంతో అధికారులు, పోలీసు యంత్రాంగం, ప్రజలుఊపిరి పీల్చుకున్నారు.

👉పెద్దేముల్ గ్రామానికే దొర ఐన జితేందర్ రెడ్డి గతంలో కూడా పలుమార్లు తమ కుటుంబం పై దాడి చేశారని… ఈరోజు రోడ్డు కబ్జా విషయమై ఆక్రమించిన భూమిని జెసిబి తో తవ్వుతూ ప్రహరీ గోడను సైతం ధ్వంసం చేయించాడని తిరిగి నాపై అలాగే నా కుటుంబసభ్యులపై దొర కుటుంబం దాడి చేస్తారని… కాబట్టి తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితుడు మోసిన్ మీడియా ప్రతినిధులతో వాపోయాడు.

                                                నేటి ఇజం ✍️✍️✍️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *