మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే అండ.

👉గత పాలకులు!అభివృద్ధికి ఆమడ దూరం

👉 బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్యే ప్రత్యేక కృషి 

👉 యూత్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఆమెర్ అబ్దుల్లా

నేటి ఇజం -తాండూరు : గత రెండు రోజుల క్రితం చేవెళ్ల బస్సు ప్రమాదంలో అసువులు బాసిన మృతులకు అండగా ఉంటూ, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు స్థానిక శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఆమెర్ అబ్దుల్లా అన్నారు. బుధవారం తాండూరు నియోజకవర్గంలో చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు 14 మందికి సంబందించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందించిన ₹7లక్షల చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆమెర్ అబ్దుల్లా మాట్లాడుతూ చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రతిపక్ష్యాల నాయకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి బస్సు ప్రమాదమే కరీంనగర్ లో జరిగినప్పుడు మృతి చెందిన వారికి నేటికీ ఎలాంటి డబ్బులు ఇంకా అందలేదని ఎద్దేవా చేశారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, ప్రత్యేకంగా సమావేశమై ప్రమాదం జరిగిన కేవలం రెండు రోజులలోనే బాధిత కుటుంబాలను మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదుకున్నారని తెలిపారు.అలాగే తాండూరు ప్రాంత రోడ్ల అభివృద్ధికై మన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసి పంపించాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశారని అన్నారు. రానున్న ఆరు నెలల లోగా తాండూరు -హైదరాబాద్ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని ఆమెర్ అబ్దుల్లా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *