నేనే తహశీల్దార్! అంతా నా ఇష్టం?
👉తహశీల్దార్ వర్సెస్ అటవీశాఖ?
👉 అటవీ శాఖ పర్మిషన్ లేకుండా చెట్లు నరికివేత దేనికి సంకేతం?
👉 విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న ఫారెస్ట్ అధికారులు!
👉 అధికారులకు ఒకన్యాయం సామాన్యులకు ఒక న్యాయం ఉండదు కదా?
👉 వాల్టా చట్టానికి తూట్లు వేసిన తహశీల్దార్ తారసింగ్ నిజమేనా?
👉చెట్టుకొమ్మలు పడి కారు డ్యామేజ్ అవుతుందనేనా?
👉 పాముల సాకుతో పచ్చదనంపై గొడ్డలి పెట్టు!ఎందుకు?
👉 ఒకే ఒక్క చెట్టుకొమ్మ అడ్డంకి సాకుతో పదుల సంఖ్యలో చెట్ల నరికివేత దేనికి సంకేతం?
👉 ప్రభుత్వ కార్యాలయాల స్థలంలో చెట్లు నరకాల్సి వచ్చినప్పుడు అటవీ అధికారుల నుండి అనుమతి కోసం చెట్లు ఏ స్థలం ఏ ప్రభుత్వ శాఖ కార్యాలయం( ఎమ్మార్వో, ఎండిఓ, ఆర్ అండ్ బి, మున్సిపల్) కు చెందినయో ఆ శాఖ వారు అటవీ శాఖకు దరఖాస్తు చేయాలనే కనీస అవగాహన కూడా లేని తాహసిల్దార్ తారాసింగ్?
👉 ఒకవేళ చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇస్తే .. సంబంధిత అటవీ శాఖ అధికారులు చెట్లను పరిశీలించి చెట్ల రకం, చెట్టు వయస్సు, చెట్ల సంఖ్య, చెట్లను నరికి వేయడానికి గల కారణాలను పరిశీలించి అనుమతి ఇవ్వలా లేదా అని నిర్ణయిస్తారు. లేదా చెట్ల నరికి వేతకు బదులుగా ఆ చెట్టును మరోచోటుకు తరలించాలని (ట్రాన్స్ లోకేషన్) సూచిస్తారని తహశీల్దార్ కు ఎందుకు తెలియదు?
👉 రోజు వందల మంది వచ్చే తహశీల్దార్ కార్యాలయంలో నిలువు నీడనిచ్చే చెట్లను నరికి వేయాలంటే ముందుగా ప్రజాభిప్రాయం మేరకు ప్రకటన అలాగే అభ్యంతరాలు వాల్టా చట్టం ప్రకారం ప్రజలందరికీ తెలిసేలా పత్రికలలో ప్రకటనలను ఇస్తూ ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే అటవీ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలనే విషయం కూడా తహశీల్దార్ కు లేదా?
👉 తమకు సమాచారం లేకుండా ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పదుల సంఖ్యలో చెట్లను నరికి వేసిన తాండూరు తహశీల్దార్ తారాసింగ్ పై విచారణ చేస్తామంటున్నా ఫారెస్ట్ శాఖ అధికారులు! ఇది ఎక్కడికి దారితీస్తుందో?
👉 రేపు మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి.. ఏమవుతుందో వెయిట్ అండ్ సీ??

