దీనమ్మ ఏమి జీవితం! జిందగిలా సూస్తా అనుకోలే?
👉 బిల్లు పాస్ చేయవలసిన బిజెపి, బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్, 42 శాతాన్ని ఏకీభవిస్తున్నామంటున్నా బిఆర్ఎస్, బీఎస్పీ, ఎంఐఎం, వామపక్ష పార్టీలు అందరూ బిసి బంద్ లో పాల్గొనిరి?
👉 బీసీ బంద్ ల అన్ని పార్టీలు మద్దతు ఇచ్చే!!! మల నిరసన ఎవరికి సెప్పినట్ల?
👉గీ యాల!! రోజు ఒకరిపై ఒకరు తిట్టుకునే వివిధ పార్టీల అతిరథ మహానుభావును అందరినీ ఒకే ఫ్రేములో బంధిస్తుంటే … సెల్ ఫోన్ కెమెరా కూడా పగలవడి నవ్వుతుండే 🤣?
👉గీ కలయిక మంచిగనే ఉంది గాని,,, కనీసం 6నెలలకు ఒకసారైనా గిట్లనే కలిసి అందరూ తాండూరు అభివృద్ధి కోసం చర్చించుకుంటే మన తాండూరు అభివృద్ధి ఎక్కడకు పోతదో? అంటూ పలువురు గుసగుసలాడుడు నిజమే గదా?
👉కార్యకర్తలారా జర సొంచాయించుండ్రి!
👉 నాయకులు అందరూ ఒక్కటే…. కార్యకర్తలం అంటూ మీరే కొట్టుకొని చస్తున్నారు.. అర్థమైందా??
నేటి ఇజం
✍️✍️✍️✍️✍️కుమార్

