భిన్నత్వంలో ఏకత్వం మన అంజద్ భాయ్.
👉 దేవీ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక పూజలు- అన్నదాన కార్యక్రమం
👉 గత 21సం “లుగా సొంత ఊర్లో వినాయక విగ్రహాన్ని సైతం అందిస్తున్న వైనం
నేటి ఇజం-తాండూరు: ముఖ్యంగా వికారాబాద్ జిల్లా అనే బదులుగా పాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే తాండూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భిన్నత్వంలో ఏకత్వం- నా భారతదేశం అనే నానుడిని నిజం చేస్తూ (దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్న) భిన్నత్వంలో ఏకత్వం మన తాండూరు కూడా అని రుజువు చేశారు ఓ ముస్లిం భక్తుడు.
వివరాల్లోకి వెళితే తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ పార్టీలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అంజద్ గురువారం తాండూరు పట్టణం గుమాస్తా నగర్ లో ప్రతిష్టించిన నవజ్యోతి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంజద్ మాట్లాడుతూ కుల- మత భేధం లేదని ఇక్కడ అందరం సమానమే అని ఉన్నన్ని రోజులు కలిసి మెలిసి ఉండాలని తల్లిదండ్రులు, గురువులు నేర్పించారని తెలిపారు. అలాగే నేటికీ దాదాపు నిర్విరామంగా 21 సంవత్సరాలుగా తమ సొంత గ్రామంలో ప్రతిష్టించే వినాయక విగ్రహాన్ని కూడా తమ కుటుంబ సభ్యులమే అందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
అనంతరం కానిస్టేబుల్ అంజద్ ను నవ జ్యోతి దేవీ నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు, కాలనీ ప్రజలు తదితరులు ఘనంగా సన్మానించారు.

