దుర్గా మాత చౌక్ దిశగా నామకరణం?

దుర్గా మాత చౌక్ దిశగా నామకరణం?

👉30సం “రాలుగా అమ్మవారిని ప్రతిష్టించడం అదృష్టం

👉 రైతుల, నిరుద్యోగుల, వ్యాపారస్తులపై తల్లి దీవెనలు ఉండాలి.

👉మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్

నేటి ఇజం -తాండూరు : తాండూరు పట్టణంలోని బసవన్నకట్ట ప్రదేశానికి దుర్గామాత చౌక్ గా నామకరణం చేయాలని రాజు గౌడ్ అన్నారు. తాండూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా అమ్మవారిని ప్రతిష్టించి గత 30 సం”రాలుగా నిర్విరామంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పే దిశగా దుర్గామాత సేవలో తరిస్తున్న గాంధీనగర్ బసవన్నకట్ట ఉత్సవ సంఘం కమిటీని నేడు హిందూ హైందవ సోదరులు ఆదర్శంగా తీసుకోవాలని- ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్( సుశీల్ కుమార్ గౌడ్) రాజు గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని గాంధీనగర్ బసవన్నకట్ట ప్రాంతంలో ప్రతిష్టించిన దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ తాండూరు ప్రాంత రైతులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులపై దుర్గామాత ఆశీస్సులు ఉండాలని అలాగే కుల మత భేదం లేకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *