బుయ్యని శ్రీనివాస్ రెడ్డితో సత్యమూర్తి భేటి
23 వ వార్డు సమస్యలపై చర్చలు
నేటి ఇజం తాండూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు దొరిశెట్టి సత్యమూర్తి శనివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 23వ వార్డు వాల్మీకి నగర్ లో నెలకొన్న సమస్యలపై చర్చించినట్లు అలాగే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేద కుటుంబాలకు అందించాలని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సూచించినట్లు దొరిశెట్టి సత్యమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు వేణు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

