గత ప్రభుత్వం ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు
👉ప్రజా ప్రభుత్వం పేదల పక్షం కాంగ్రెస్ కే సాధ్యం
👉 ఎమ్మెల్యే సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి
👉 23వ వార్డు ఇన్చార్జ్ భరత్ రెడ్డి
నేటి ఇజం తాండూరు : తెలంగాణ రాష్ట్రా న్ని 10 సంవత్సరాలు పరిపాలించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వలేదని తాండూరు పట్టణం వాల్మీకి నగర్ 23 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భరత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో భాగంగా వార్డులోని అర్హులైన నిరుపేదలకు మొదటి విడతగా మంజూరైన 50 రేషన్ కార్డులను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వాల్మీకి నగర్ 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భరత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవతో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేస్తామని తెలిపారు. అలాగే ఇంకా రేషన్ కార్డులు లేనివారికి సైతం రెండవ విడతలో భాగంగా ఎమ్మెల్యే సహకారంతో అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు మాధవి, మున్సిపల్ వార్డు ఆఫీసర్ మహేశ్వరి ఆర్ పి రాధిక తదితరులు పాల్గొన్నారు.

