వైద్య కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

వైద్య కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

👉సిసి రోడ్డు, క్యాంపౌండ్ వాల్, సి సి టి వి లు ఏర్పాటు చేయాలి

👉వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటలో ఉండాలి. 

👉 ఆస్పత్రిలో సరిపడా మందులు, సౌకర్యాలు ఉన్నాయా?

👉రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోగ్థు

నేటి ఇజం :తాండూరు: తాండూరు నియోజకవర్గం లో కొడంగల్ కు సంబంధించి కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోగ్థు అన్నారు.బుధవారం తాండూరులోని కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ల తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల కు సంబంధించిన మ్యాపు ను పరిశీలించి, అన్ని రూము లకు సీరియల్ నెంబర్లు వేయాలని, సిసి రోడ్డు, క్యాంపౌండ్ వాల్, సి సి టి వి లు ఏర్పాటు, సెక్యూరిటీ రూమ్ ఏర్పాటు, వాటర్, లైట్స్, అన్ని మౌలిక సౌకర్యాలతో ఒక వారము వరకు పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశించారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రతి రూమును, ప్రతి వార్డు ను తిరిగి అక్కడి సిబ్బంది తో మాట్లాడారు. రిజిస్టర్ లను పరిశీలించారు. ఆసుపత్రి కి వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటలో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్నారు. ఐ సి యు, డయాగ్నోస్టిక్ సెంటర్, బ్లడ్ బ్యాంకు, ఎమర్జెన్సీ వార్డ్, జనరల్ వార్డ్,ఐ సి టి సి ల్యాబ్, గర్భిణీ లకు చికిత్స అందించే సెంటర్ ను, గొంతు, చెవి, ముక్కు సంబంధించి ఓ పి లను, ఆఫ్టమాలాజీ. ఆర్థోపెడిక్, బ్లడ్ బ్యాంక్, డెంటల్, ఐ సి. యు, ఆసుపత్రి లో అన్ని విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాలలో పని చేస్తున్న సిబ్బంది తో ఎంత కాలం నుండి పని చేస్తున్నారు, మీకు ఇంకా ఏవైనా పరికరాలు అవసమున్నాయా అని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.డాక్టర్స్ సమయ పాలన పాటించాలని ఆదేశించారు.అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.శానిటేషన్ సిబ్బంది హాస్పిటల్ ని శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.ఓపి ని తనిఖీ చేశారు.మందుల రూమును పరిశీలించి అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.అలాగే మాత, శిశు ఆరోగ్య కేంద్రం ను పరిశీలించారు. వివిధ విభాగా ల కు సంబందించిన గదులను పరిశీలించారు. రోజుకు ఎంత మంది గర్భిణీ స్త్రీ లు వస్తున్నారు, రికార్డ్స్ రాస్తున్నారా, సరిపోను మందులు అందుబాటులో ఉన్నాయా, పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి లో పరిశుభ్రత పాటించాలని, అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ హార్స్ చౌదరి, కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, జి జి ఎచ్ మాలతీ, సూపరింటెండెంట్ సునీత తహసీల్దార్ తార సింగ్, ఆర్ ఎం ఓ ఆనంద్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహ రెడ్డి,మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ బి. రాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మ, కాంట్రాక్టర్ చంద్ర శేఖర్ ఇ ఇ ఉమేష్,సంబంధిత అధికారులు, డాక్టర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *